800 మెట్రిక్‌ టన్నుల యూరియా రాక | - | Sakshi
Sakshi News home page

800 మెట్రిక్‌ టన్నుల యూరియా రాక

Mar 12 2026 7:33 AM | Updated on Mar 12 2026 7:33 AM

800 మెట్రిక్‌ టన్నుల యూరియా రాక

కడప అగ్రికల్చర్‌: జిల్లాకు బుధవారం 800 మెట్రిక్‌ టన్నుల యూరియాతోపాటు 60 మెట్రిక్‌ టన్నుల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వచ్చినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావు తెలిపారు. ఇందులో యూరియాకు సంబంధించిన 800 మెట్రిక్‌ టన్నులలో 500 మెట్రిక్‌ టన్నులను ప్రైవేటు డీలర్లకు కేటాయించగా మరో 300 మెట్రిక్‌ టన్నులను మార్కెఫెడ్‌కు కేటాయించినట్లు తెలిపారు. అలాగే 60 మెట్రిక్‌ టన్నుల మ్యూరేట్‌ ఆఫ్‌ పోటాస్‌కుగాను 60 టన్నులను ప్రైవేటు డీలర్లకు కేటాయించినట్లు తెలిపారు. కడప మండల వ్యవసాయ ఽఅధికారి సురేష్‌కుమార్‌రెడ్డి, జేడీఏ కార్యాలయ ఏఓ గోవర్దన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement