కడప కోటిరెడ్డిసర్కిల్: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ పరిధిలోని బాలల పరిరక్షణ విభాగం, శిశుగృహ, ప్రాంతీయ బాలసదనం, అక్కాయపల్లె, కొండాయపల్లె ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు జారీ చేసిన నోటిఫికేషన్ రద్దయింది. అనివార్య కారణాలతో ఈ రెండు నోటిఫికేషన్లను కలెక్టర్ ఆదేశాల మేరకు రద్దుచేశామని ఐసీడీఎస్ పీడీ పి.రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు.
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం 11, 12, 13, 14 కాన్వకేషన్లలో ఇద్దరు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయనున్నట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. తేలికపాటి యుద్ధ విమానాల (తేజస్) రూపకర్త డా.కోటా హరినారాయణ, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమి ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ సి. మండేలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎంపిక చేశారన్నారు. ఈనెల 13న జరిగే స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా వారికి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేస్తామన్నారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ద్వితీయ సంవత్సర కామర్స్ పేపర్–2, సోసి యాలజీ సోసియల్–2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్–2లకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 62 పరీక్షా కేంద్రాలకుగాను 264 మంది గైర్హాజరయ్యారు. ఇందులో భాగంగా జనరల్‌కు సంబంధించి 2207 మందికిగాను 2083 మంది హాజరుకాగా 124 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషన్‌కు సంబంధించి 780 మందికిగాను 140 మంది గైర్హాజరయ్యారు.


