వీబీజీ రామ్‌జీ నెలరోజులు వాయిదా | - | Sakshi
Sakshi News home page

వీబీజీ రామ్‌జీ నెలరోజులు వాయిదా

Mar 14 2026 7:48 AM | Updated on Mar 14 2026 7:48 AM

అధికారులకు లభించిన గడువు

కడప సిటీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు మరియు నూతన విధివిధానాల అమలు మరో నెల రోజులు వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ’వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌ గ్రామీణ్‌–2025’ మే 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. తొలుత ఏప్రిల్‌ 1 నుంచి ఈ మార్పులు చేపట్టాలని భావించినప్పటికీ, విధివిధానాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఢిల్లీ సమావేశంలో స్పష్టత: ఈ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్‌ అధికారులతో ఈ నెల 17, 18 తేదీలలో ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీ తర్వాతే నిధుల కేటాయింపు, పనిదినాల పెంపు (100 నుంచి 125 రోజులకు) మరియు ఇతర సాంకేతిక మార్పులపై పూర్తి స్పష్టత రానుంది.

కొత్త పథకం తక్షణమే అమలులోకి వచ్చి ఉంటే, పాత ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కింద చేసిన పనుల బిల్లులు పెండింగ్‌లో పడతాయని, సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు అదనంగా ఒకటిన్నర నెల గడువు లభించడంతో, మార్చి నెలాఖరులోపు పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేసి, బిల్లులు చెల్లించేందుకు అవకాశం దక్కింది. దీంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

ఊపిరి పీల్చుకున్న అధికారులు

పాత బకాయిలు, పెండింగ్‌ పనుల పూర్తికి దక్కిన వెసులుబాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement