వాల్మీకిపురం : అతివేగంగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ఓ ట్రాక్టర్‌ను ఢీకొన్న సంఘటన మంగళవారం సాయంత్రం మండల పరిధి విఠలం సమీపంలోని హైవేపై చోటు చేసుకొంది. వివరాలు.. మండలంలోని చింతపర్తి నుంచి వాల్మీకిపురానికి ట్రాక్టర్ వెళ్తుండేది. చైన్నె నుంచి బళ్లారికి కారులో కౌషిక్ వెళ్తున్నాడు. అతివేగంగా కారు నడపడంతో అదుపు చేయలేక ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొన్నాడు. దీంతో ట్రాక్టర్ బోల్తాపడగా, కారు నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


