కాల్‌ సెంటర్‌ సేవలను వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కాల్‌ సెంటర్‌ సేవలను వినియోగించుకోవాలి

Mar 9 2026 7:28 AM | Updated on Mar 9 2026 7:28 AM

కాల్‌ సెంటర్‌ సేవలను వినియోగించుకోవాలి 11న వైఎస్సార్‌ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నేడు ’డయల్‌ యువర్‌ సీఎండీ’ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ అసోసియేషన్‌ సభ్యుల ఎన్నిక హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌లు సక్రమంగా విభజించాలి

కడపసెవెన్‌రోడ్స్‌: ప్రజా సమస్యల పరిష్కారానికి మీ కోసం కాల్‌ సెంటర్‌ 1100 సేవలను ప్రజలు వినియోగించు కోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీలు పరిష్కారం కాకపోయినా, సమాచారం తెలుసుకోవడానికి కాల్‌ చేయవచ్చని పేర్కొన్నారు.

కడప కార్పొరేషన్‌: కాకినాడలో ఈ నెల 11న వైయస్సార్‌సీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌ బాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జోన్ల వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు పాల్గొంటారన్నారు. వైయస్‌ఆర్సీపీ ఎస్సీ విభాగ నేతలందరూ హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.

కడప కార్పొరేషన్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 9వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ’డయల్‌ యువర్‌ సీఎండీ’కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్‌ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిఎండి కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 89777 16661 నంబర్‌కు కాల్‌ చేసి తమ విద్యుత్‌ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు.

సర్కిల్‌ స్థాయిలోనూ

డయల్‌ యువర్‌ ఎస్‌ఈ

డయల్‌ యువర్‌ ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమంతో పాటు సర్కిల్‌ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గం్ఢ్ఢల వరకు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్‌ సమస్యలను సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా 08562–242457 నంబర్‌కు కాల్‌ చేయాలని ఏపీఎస్పీడీసీఎల్‌ ఒకప్రకటనలో తెలిపింది.

కడప కోటిరెడ్డిసర్కిల్‌: స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా కడప రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బి.రాజశేఖర్‌ను ఎన్నుకున్నారు. ఆదివారం కడప నగరంలో జరిగిన జనరల్‌ బాడీ ఎన్నికల సమావేశంలో జిల్లా రిజి స్ట్రార్‌ పీవీఎన్‌ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈయనను ఎన్నుకున్నారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎస్‌.ఈశ్వరయ్య, జనరల్‌ సెక్రటరీగా సీహెచ్‌ విజయ్‌రాజు, జాయింట్‌ సెక్రటరీగా ముని వెంకట రత్నం, కోశాధికారిగా ప్రవీణ్‌, ఈసీ మెంబర్లుగా కె.రమేష్‌, పి.అరుణకుమారి, పూల సురేంద్ర, జె.భారతిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సబ్‌ రిజిస్ట్రార్లు ఎస్‌.అబ్దుల్‌ సత్తార్‌, అజీజుల్లా, డీఎం బాషా పాల్గొన్నారు.

కడప సెవెన్‌రోడ్స్‌: జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా అధికారులు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌లను సక్రమంగా విభజించాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు అన్నారు. లే అవుట్‌ మ్యాప్‌లను గుర్తించి డీ మార్కేషన్‌ చేయాలన్నారు. ఆదివారం కలెక్టరేట్‌ సభా భవనంలో జిల్లా స్థాయి సెన్సస్‌ నిర్వహణపై ఛార్జి అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సెన్సస్‌ జిల్లా ఇన్‌ఛార్జి మోహన్‌ రమణ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వివరించారు. క్షేత్ర స్థాయిలో ఎన్యుమరేటర్లు లే అవుట్‌ మ్యాప్‌ను ఎలా డ్రా చేయాలో, వీధులు, ముఖ్యమైన ప్రదేశాలు, ఇళ్ల సంఖ్యలను మ్యాప్‌లో ఎలా సూచించాలో ఆయన వివరించారు. ఎన్యుమరేటర్లు ఉపయోగించే యాప్‌ పనివిధానం ప్రదర్శన ద్వారా చూపించారు. యాప్‌లో వివరాలు నమోదు చేసే విధానం,లైవ్‌ లోకేషన్‌ ద్వారా ఎన్యుమరేటర్ల పనిని ఎలా ట్రాక్‌ చేయవచ్చో డెమో నిర్వహించారు. హౌస్‌ లిస్టింగ్‌ పూర్తయిన తర్వాత రూపొందించే డిస్ట్రిక్ట్‌ సెన్సస్‌ హ్యాండ్‌బుక్‌ తయారీ విధానం గురించి కూడా శిక్షణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement