ఘనంగా మహిళా దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మహిళా దినోత్సవం

Mar 9 2026 7:28 AM | Updated on Mar 9 2026 7:28 AM

కడప కార్పొరేషన్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకటసుబ్బమ్మ ,నగర అధ్యక్షురాలు బండి దీప్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి ,బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధ, మేయర్‌ పాకా సురేష్‌కుమార్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై కేక్‌ కట్‌ చేసి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. మహిళా సాధికారత సాధించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎంతో కృషి చేశారని, ఆయన ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరు మీదనే అందించారని గుర్తు చేశారు. వైఎస్సార్‌ సీపీ మహిళా నేతలు రత్నకుమారి, కృష్ణవేణి, నారాయణమ్మ, ఉమామహేశ్వరి, సుశీలమ్మ, తులశమ్మ, సునీత ,మల్లీశ్వరి, జ్యోతి ,నాగమణి పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో

కేక్‌ కట్‌ చేసిన నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement