కర్నూలు, అనంతపురం జట్ల విజయం | - | Sakshi
Sakshi News home page

కర్నూలు, అనంతపురం జట్ల విజయం

Mar 19 2026 7:44 AM | Updated on Mar 19 2026 7:44 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ సౌత్‌జోన్‌ సీనియర్స్‌ మెన్‌ అంతర్‌ జిల్లాల వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. బుధవారం వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో కర్నూలు–నెల్లూరు జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన నెల్లూరు జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌ ప్రారంభించిన కర్నూలు జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 242 పరుగుటు చేసింది. ఆ జట్టులోని కరణ్‌ షిండే 124 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 132 పరుగులు చేశాడు. నాయిముల్లా 32 పరుగులు చేశాడు, నెల్లూరు జట్టులోని సాకేత్‌ రామ్‌ 2 వికెట్లు, భరత్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన నెల్లూరు జట్టు 47.1 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. జట్టులోని సుబ్రమణ్యం 28 పరుగులు, రోషన్‌ పవన్‌కుమార్‌ 46 పరుగులు, భరత్‌ 48 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని సాయి సూర్య తేజరెడ్డి 4 వికెట్లు, సుదర్శన్‌రెడ్డి 2, అంజనేయులు 2, ఖనిష్‌ 2 రెండు వికెట్లు తీశారు. దీంతో కర్నూలు జట్టు 1 పరుగు తేడాతో విజయం సాధించింది.

కెఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో..

కెఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కడప–అనంతపురం జట్లు తలపడ్డాయి, టాస్‌గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 363 పరుగులు చేసింది. ఆ జట్టులోని అర్జున్‌ టెండూల్కర్‌ 68, ఎంకె దత్త రెడ్డి 72 పరుగులు, హానిష్‌ వీరారెడ్డి 62 పరుగులు, గిరినాఽథ్‌రెడ్డి 68 పరుగులు చేశారు. కడప జట్టులోని చెన్నారెడ్డి 2, పఠాన్‌ షరీఫ్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన కడప జట్టు 48.3 ఓవర్లకు 277 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులోని ధృవకుమార్‌ రెడ్డి 75, వంశీకృష్ణ 50, వాసుదేవ రాజు 51 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని మల్లిఖార్జున 4 వికెట్లు, ప్రమోద్‌ కుమార్‌ 3 వికెట్లు తీశారు. దీంతో 86 పరుగులు తేడాతో అనంతపురం జట్టు విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement