నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

Mar 10 2026 7:34 AM | Updated on Mar 10 2026 7:34 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు రాష్ట్ర పిలుపులో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు చిన్ని, శివకుమార్‌లు ఈ సందర్బంగామాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. ప్రతి ఏటా జనవరి 1వ తేదీ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్‌ ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. కేవలం 16 వేల ఉపాధ్యాయ పోస్టులు డీఎస్సీ ద్వారా భర్తీ చేయడం మినహా నిరుద్యోగులకు చేసిదంటూ ఏమి లేదన్నారు. రాష్ట్రంలో ఖాళీగాఉన్న 2,18,000 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్‌చేశారు. సూపర్‌సిక్స్‌లో భాగంగా నిరుద్యోగులకు రూ.3 వేల భృతి చెల్లించాలన్నారు. ఉద్యోగాలు రాక పలువురు బలవన్మరణాలపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగాది నాటికి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీచేయకపోతే చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సునీల్‌, సహాయ కార్యదర్శి ఎస్‌కే ఆదిల్‌, నగర కార్యదర్శి విజయ్‌, ఉపాధ్యక్షులు పెద్దన్న, జిల్లా మహిళా నాయకురాళ్లు ఫాతిమా, నాగేశ్వరి, స్నేహలత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement