పెండ్లిమర్రి : ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన విజయ్ కుమార్‌రెడ్డికి డిక్సన్ కంపెనీ ప్రతినిధులు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పి.నరేన్ రామాంజులరెడ్డి సమక్షంలో శనివారం అర్థిక సహాయం అందజేశారు. మండలంలోని పెసవాండ్లపల్లె గ్రామానికి చెందిన విజయ్‌కుమార్‌రెడ్డి గత నెల 7వ తేదీన ద్విచక్ర వాహనంలో కొప్పర్తి సమీపంలోని ఈఎంసీ కంపెనీకి వెళుతుండగా డిక్సన్ కంపెనీకి చెందిన రాజ్యలక్ష్మి ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. అప్పట్లో బస్సు యాజమాన్యం వైద్య చికిత్స చేయిస్తామని చెప్పి స్పందించకపోవడంతో గ్రామస్తులు ఈవిషయాన్ని నరేన్ రామాంజులరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందిచి బస్సు యాజమాన్యానికి ఫోన్ చేశాడు. వారి వద్ద నుంచి సరైన సమాదానం రాకపోడంతో డిక్సన్ కంపెనీ వద్దకు వెళ్లి ట్రావెల్స్ బస్సులు నిలిపివేస్తామని కంపెనీ ప్రతినిధులను హెచ్చరించడంతో వారు పైస్థాయి అధికారులతో మాట్లాడి బాధిత వ్యక్తికి వైద్య చికిత్స చేయించి అర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులకు డిక్సన్ కంపెనీ ప్రతినిధులు రూ.3లక్షల నగదు అందజేసి, కోలుకున్న తర్వాత కంపెనీలో జాబ్ ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. నరేన్ రామాంజురెడ్డికి బాధితుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వండ్లవాండ్లపల్లె గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు ఓనూర్‌సాబ్‌ను నరేన్‌రామాంజులరెడ్డి పరామర్శించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చౌర్మన్ బాలయ్య, పొలతల మాజీ చైర్మన్ నాగమల్లారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు సాంబశివారెడ్డి, రామచంద్రారెడ్డి, హైదర్‌బాషా, పాల్గొన్నారు.


