ఇంటర్‌ పరీక్షకు 586 మంది గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షకు 586 మంది గైర్హాజరు

Mar 11 2026 7:47 AM | Updated on Mar 11 2026 7:47 AM

కడప ఎడ్యుకేషన్‌ : ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన ప్రథమ సంవత్సర ఫిజిక్స్‌ పేపర్‌–1 పరీక్షకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 62 పరీక్షా కేంద్రాలకు గాను 586 మంది గైర్హాజయ్యారు. ఇందులో భాగంగా జనరల్‌కు సంబంధించి 13131 మందికి గాను 12741 మంది హాజరు కాగా 390 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్‌కు సంబంధించి 1210 మందికి గాను 1014 మంది హాజరు కాగా 196 మంది గైర్హాజయారు. ఇలా జనరల్‌, ఒకేషనల్‌కు కలిసి మొత్తంగా 14341 మందికి గాను 13755 మంది హాజరు కాగా 586 మంది గైర్హాజరయారు.

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలి

కడప అర్బన్‌ : ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్‌.పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ హెచ్చరించారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 274 కేసులు నమోదు చేసి, రూ. 56,615 జరిమానా విధించడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. కార్లలో వెళ్లే వారు తప్పనిసరిగా సీట్‌ బెల్ట్‌ ధరించాలని సూచించారు. రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌ ప్రమాదకరమని, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వృద్ధురాలిపై దాడి.. కేసు నమోదు

రాజుపాళెం : మండలంలోని వెలవలి గ్రామానికి చెందిన వృద్ధురాలిపై దాడి చేసిన సంఘటనలో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రణయ్‌ కుమార్‌ మంగళవారం తెలిపారు. మండలంలోని వెలవలి గ్రామానికి చెందిన మాబుచాన్‌, ఆమె భర్త కరీం ఇరువురు కూలి పనులకు రావడం లేదని రాజుగారి అమిరూన్‌ కక్ష పెట్టుకున్నాడు. సోమవారం వృద్ధురాలు మాబుచాన్‌ తలపై అమిరూన్‌ కట్టెతో కొట్టడంతో ఆమె తలకు రక్తగాయమైంది. దీంతో మాబుచాన్‌ను ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement