ద్వితీయ స్థానంలో నిలిచిన బద్వేలు జట్టు
ప్రఽథమ స్థానంలో నిలిచిన రాజంపేట జట్టు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: రౌనక్ హుస్సేన్ స్మారక జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను జిల్లా వాలీబాల్ అసోసియేషన్, జిల్లా సీనియర్ వాలీబాల్ క్రీడాకారుల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన టోర్నమెంట్‌లో రాజంపేట జట్టు విజేతగా నిలిచిందని డీఎస్‌డీవో గౌస్ బాషా తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. నాకౌట్–కమ్–లీగ్ విధానంలో నిర్వహించిన ఈ టోర్నీలో మొత్తం 30 జట్లు పాల్గొన్నాయన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో రాజంపేట జట్టు అద్భుతమైన ప్రదర్శనతో విజేతగా నిలిచి రూ.25వేలు నగదు బహుమతి, రన్నరప్‌గా నిలిచిన బద్వేల్ జట్టు రూ.15 వేలు నగదు బహుమతి, రాయచోటి జట్టు మూడవ స్థానం సాధించి రూ.10 వేలు నగదు బహుమతి గెలుచుకున్నాయన్నారు. విజేత జట్లకు రౌనక్ హుస్సేన్ కుటుంబ సభ్యులు, డీవీఏ కడప కార్యదర్శి ఎన్. ఖాదర్ వల్లి బహుమతులను అందజేశారు.


