నేడు సభాభవన్‌లో పీజీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు సభాభవన్‌లో పీజీఆర్‌ఎస్‌

Mar 16 2026 7:38 AM | Updated on Mar 16 2026 7:38 AM

నేడు సభాభవన్‌లో పీజీఆర్‌ఎస్‌ నేడు ’డయల్‌ యువర్‌ సీఎండీ’ తాళ్లపాకను సందర్శించిన తెలంగాణా పోలీస్‌ అధికారి వినియోగదారులు హక్కులు తెలుసుకోవాలి

కడపసెవెన్‌రోడ్స్‌: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యా దుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌)ను సోమ వారం సభాభవన్‌లో నిర్వహించనున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను మీకోసం డాట్‌ ఏపీ డాట్‌ జీఓవీ డాట్‌ ఇన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చున్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవ స్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్‌ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు.

● ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్‌ సెంటర్‌ 1100 సేవలను ప్రజలు వినియోగించు కోవాలని డీఆర్వో సూచించారు.

డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం

డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562– 244437 ల్యాండ్‌ లైన్‌ నెంబరుకు ఫోన్‌ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని పేర్కొన్నారు.

కడప కార్పొరేషన్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 16వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ’డయల్‌ యువర్‌ సిఎండి’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్‌ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూ రు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 89777 16661 మొబైల్‌ నంబర్‌కు కాల్‌ చేసి తమ విద్యుత్‌ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చన్నారు.

సర్కిల్‌ స్థాయిలోనూ

‘డయల్‌ యువర్‌ ఎస్‌ఈ’

డయల్‌ యువర్‌ ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమంతో పాటు సర్కిల్‌ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు ’డయల్‌ యువర్‌ ఎస్‌ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్‌ సమస్యలను సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా వినియోగదారులు 08562 242457 నంబర్‌కు కాల్‌ చేయవచ్చని తెలిపారు.

రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్ధలిలోని సిద్దేశ్వరస్వామి ఆలయాన్ని తెలంగాణా పోలీస్‌ అధికారి డా.తరుణ్‌జోషి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో ఏకాతాతయ్యను దర్శించుకున్నారు. అన్నమాచార్యులు ఆరాధించి, పూజించిన శ్రీ చెన్నకేశవస్వామిని కూడా దర్శించుకున్నారు. అనంతరం హత్యరాలలో వెలసిన శ్రీ కామాక్షి త్రేతేశ్వరాలయంను దర్శించుకున్నారు. ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు.

నందలూరు: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన నందలూరు శ్రీ సౌమ్యనాధ స్వామిని తెలంగాణ రాష్ట్రం అడిషనల్‌ ఐజీ డాక్టర్‌ తరుణ్‌జోషి ఆదివారం దర్శించుకున్నారు.

కడప కార్పొరేషన్‌: వినియోగదారులు తమ హక్కులు, రక్షణ చట్టం–1986 గూర్చి తెలుసుకోవాలని ది నేషనల్‌ కన్జ్యూమర్‌ రైట్స్‌ కమిషనర్‌ నేషనల్‌ చైర్మన్‌ డా. సాయి రమేష్‌ అన్నారు. ఆదివారం నగర శివార్లలోని నిర్మల ఫార్మసీ కాలేజీలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాయి రమేష్‌తో పాటు కన్స్యూమర్‌ ఫోరమ్‌ అడ్వకెట్‌ మల్లికార్జున, కడప నగరపాలక కమిషనర్‌ రాకేష్‌ చంద్ర, అసిస్టెంట్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ ఆశ, లీగల్‌ మెట్రోలజీ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ రెడ్డి, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ రమేష్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వినియోగదారునికి కొన్ని హక్కులుంటాయన్నారు. ఏదైనా వస్తువు కొనేటప్పుడు బిల్‌ కచ్చితంగా తీసుకోవాలని, నాణ్యమైన ఐఎస్‌ఐ, ఐఎస్‌ఓ మెట్రోలజీ సర్టిఫికెట్‌ కలిగిన, తయారు చేసే వాటిని మాత్రమే వినియోగించాలన్నారు. జిల్లాలో 80 శాతం సర్టిఫికెట్‌ లేకుండా నాణ్యమైన నీరు ఇవ్వకుండా కొన్ని వాటర్‌ప్లాంట్లు తక్కువ ఖర్చుతో ఎక్కుల లాభాలు ఆర్జిస్తున్నాయన్నారు. కొన్ని రెస్టారెంట్లలో రుచి కోసం టేస్టింగ్‌ సాల్ట్‌లు వాడుతున్నారన్నారు. ఫార్మసీ యాక్టు ప్రకారం ప్రతి మెడికల్‌ షాపులో ఒక పార్మసిస్ట్‌ ఉండాలని, కానీ అలా ఉండటం లేదన్నారు. దీనివలన వినియోగదారుడు చాలా నష్టపోతున్నాడని, ఎవరైనా వస్తువులు కొని నష్టపోతే వినియోగదారుల ఫోరంలో కేసు వేయవచ్చని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement