లోక్‌ అదాలత్‌ కేసుల పరిష్కారంలో జిల్లాకు ప్రథమ స్థానం | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌ కేసుల పరిష్కారంలో జిల్లాకు ప్రథమ స్థానం

Mar 16 2026 7:38 AM | Updated on Mar 16 2026 7:38 AM

కడప అర్బన్‌ : వైఎస్సార్‌ కడప జిల్లాలో ఈనెల 14న జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 1,03,591 కేసులు పరిష్కారం చేసి లబ్ధిదారులకు రూ.24,01,72,158 కక్షిదారులకు చెల్లించారు. జిల్లా వ్యాప్తంగా 23 బెంచీలు ఏర్పాటు చేశారు. జాతీయ లోక్‌ అదాలత్‌ లో జిల్లావ్యాప్తంగా 103343 క్రిమినల్‌ కేసులు, 248 సివిల్‌ కేసులు, 53 ఫ్రీ లిటిగేషన్‌ కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ సి.యామిని తెలియజేశారు. కడపలో 11720 కేసులు, పొద్దుటూరు, మైదుకూరులో 15303, రాజంపేటలో7116, రాయచోటిలో 9635, బద్వేల్‌లో 8105, జమ్మలమడుగులో 9700, సిద్ధవటంలో 5070, రైల్వేకోడూరులో 6117, పులివెందులలో 8394, నందలూరులో 6055, లక్కిరెడ్డిపల్లిలో 10093, కమలాపురంలో 6283 కేసులు పరిష్కారమైనట్లు చెప్పారు. కేసుల పరిష్కారానికి తోడ్పడిన న్యాయవాదులకు, రెవెన్యూ సిబ్బందికి, పోలీసు అధికారులకు, కృతజ్ఞతలను తెలియజేశారు. కేసుల పరిష్కారంలో వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ప్రథమస్థానంలో నిలిచిందని చెప్పారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి

డాక్టర్‌ సి.యామిని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement