ఇఫ్తార్‌ విందు పుణ్యకార్యం | - | Sakshi
Sakshi News home page

ఇఫ్తార్‌ విందు పుణ్యకార్యం

Mar 15 2026 5:09 AM | Updated on Mar 15 2026 5:09 AM

గఫారియా ఫ్యామిలీ వితరణ చేసిన ఈదీని పేద కుటుంబాలకు అందిస్తున్న ఎంపీ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి

తదితరులను గజమాలతో సన్మానిస్తున్న ఇస్మాయిల్‌

కమలాపురం : ముస్లింలు అత్యంత పవిత్రంగా కొలిచే రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలు పాటించే వారికి ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ విందు పుణ్యకార్యం అని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, ఆర్టీసీ మాజీచైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నరేన్‌ రామాంజులరెడ్డి తెలిపారు. శనివారం కమలాపురం లోనిదర్గా–ఈ–గఫారియాలో దర్గా కన్వీనర్‌, వైఎస్సార్‌ సీపీ స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఫర్‌ వలంటీర్స్‌ వింగ్‌ జోన్‌–5 షేక్‌ ఇస్మాయిల్‌ ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు వారు హాజరయ్యారు. నాయకులను గజమాలతో సత్కరించారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఫైజుల్‌ గఫార్‌ షా ఖాద్రి వారికి శాలువా కప్పి నన్మానించారు. ఇస్తార్‌ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన వైఎస్సార్‌ సీపీ నాయకులు ముస్లింలకు పండ్లు, ఫలాలు ఇచ్చి ఉపవాసాన్ని విరమింపజేశారు. అనంతరం దర్గాలో స్వాముల వారి మజార్లను దర్శించుకుని ప్రత్యేక ఫాతెహ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రంజాన్‌ మాసంలో ఈ దర్గాలో ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇఫ్తార్‌ విందు పుణ్యకార్యంగా భావిస్తున్నామన్నారు. కాగా గఫారియా ఫ్యామిలీ వితరణ చేసిన ఈదీ (పండుగ సరుకులు)ని వారు 2000 మంది పేద ప్రజలకు అందజేశారు. అనంతరం ఇస్మాయిల్‌ ఏర్పాటు చేసిన విందులో వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో పీఠాధిపతి సోదరులు దస్తగిరి స్వామి, మౌలానా, గౌస్‌ పాక్‌, జియా మాలిక్‌, సర్ఫరాజ్‌, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర నాయకులు సాయినాథశర్మ, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, మాసీమ బాబు, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ఉత్తమారెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, సుమిత్రా రాజశేఖర్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, మహ్మద్‌ సాదిక్‌, గండి భాస్కర్‌, గఫార్‌, జావీద్‌, మోనార్క్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement