కేజీబీవీల్లో ప్రవేశాలకు పిలుపు | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీల్లో ప్రవేశాలకు పిలుపు

Mar 10 2026 7:33 AM | Updated on Mar 10 2026 7:33 AM

ఆరో తరగతి, ఇంటర్‌లో

ప్రవేశాలకు అవకాశం

నిరుపేద కుటుంబాల

బాలికలకు సదవకాశం

ఈ నెల 12 నుంచి

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ

కడప ఎడ్యుకేషన్‌: గ్రామీణ ప్రాంత నిరుపేద కుటుంబాలు, అనాథ బాలికల చదువుకు కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు) బాసటగా నిలుస్తున్నాయి. ఉచిత వసతితోపాటు భోజనం, ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ ఆదరిస్తున్నాయి. బాలికల ఉజ్వల భవిష్యత్తుకు గట్టిపునాది వేస్తున్నాయి. తాజాగా కేజీబీవీల్లో 6వ తరగతి, ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌తోపాటు 7, 8, 9, 10వ తరగతుల ఖాళీ సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. అర్హులైన విద్యార్థినులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. అధికారుల వివరాల ప్రకారం ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులే అడ్మిషన్‌ ప్రక్రియలో పరిగణించబడతాయి. ఈ పాఠశాలల్లో అడ్మిషన్లకు సంబంధించి కొన్ని అర్హత ప్రమాణాలున్నాయి, పేద కుటుంబాలకు చెందిన బాలికలు మాత్రమే ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అర్హత కలిగి ఉంటారు. ఇందులో అనాథలు, బడిబయట ఉన్న పిల్లలు, చదువు మానేసిన డ్రాపౌట్స్‌ విద్యార్థులు, పేద కుటుంబాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి వర్గాల బాలికలకు కూడా ప్రవేశాల్లో ప్రాధాన్యత ఇస్తారు. 6వ తరగతి ప్రవేశానికి అభ్యర్థి తప్పనిసరిగా 5వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశ కోసం 10వ తరగతి పాస్‌ కావాలి. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థినులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ విడుదల...

రాష్ట్ర ప్రభుత్వం 6వ తరగతిలోపాటు ఇంటర్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 1వ తేదీతో గడువు ముగుస్తుంది. జ్ట్టి ఞ:్చ ఞజుజ ఛఠి.్చ ఞఛిజటట.జీ ుఽ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. 1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ. 1.44 లక్షలకు మించి ఉండకూడదు.

జిల్లాలో 19 కేజీబీవీలు..

జిల్లాలో బాలికల అక్షరాస్యత శాతాన్ని పెంచడంతోపాటు బాలికల అక్షరాస్యత తక్కువగా ఉన్న మండలాల పరిధిలో కేజీబీవీలను ఏర్పాటు చేసింది. 2026–27వ విద్యా సంవత్సరానికి సంబంధించి 19 కేజీబీవీల్లో 1776 సీట్లు భర్తీ కానున్నాయి.

జిల్లాలో ఇంటర్‌ ఉన్న కేజీబీవీల వివరాలు...

జిల్లాలో అట్లూరు, చాపాడు, దువ్వూరు, పెద్దముడియం, కలసపాడు, పోరుమామిళ్ల, ఎస్‌ఏ కాశినాయన, సింహాద్రిపురం, బి.కోడూరు, బిమఠం, చక్రాయపేట, ఖాజీపేట, మైదుకూరు, పెండ్లిమర్రి, వల్లూరు, వేముల, కలసపాడు, జమ్మలమడుగు, సుండుపల్లిలలో కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో ఇంటర్మీడియట్‌కు సంబంధించి ఎంపీసీ, బైపీసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, హెచ్‌ఈసీ గ్రూపులున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement