కడప అర్బన్: కడప ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఫోర్స్‌మెంట్ అధికారి కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో కడప విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లై అధికారులు వైఎస్సార్ కడప జిల్లాలోని 8 హోటల్స్, దుకాణాలు, రీఫిలింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించి 6ఏ ఈసీ యాక్ట్ ప్రకారం 8 కేసులు నమోదు చేసి 34 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించేవారిపై, గ్యాస్ సిలిండర్‌లను బ్లాక్ మార్కె ట్‌లో విక్రయించేవారిపై నిరంతరం తనిఖీలు కొనసాగిస్తామని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని అధికారి కరిముల్లా షరీఫ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసుల రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


