ప్రారంభమైన తాఖ్‌రాత్‌లు | - | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన తాఖ్‌రాత్‌లు

Mar 11 2026 7:47 AM | Updated on Mar 11 2026 7:47 AM

కడప సెవెన్‌రోడ్స్‌: పవిత్ర రంజాన్‌ మాసం చివరి ఘట్టానికి చేరింది. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే తాఖ్‌రాత్‌ (బడీరాత్‌ కోసం అన్వేషణ)లు మంగళవారం రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. చివరి పదిరోజుల్లోని బేసి సంఖ్యలో వచ్చే ఐదు రాత్రుల్లో బడీరాత్‌ కోసం ముస్లింలు అన్వేషిస్తారు. ఇందులో భాగంగా రాత్రంతా తరావీహ్‌ నమాజులతో పాటు బయాన్‌.. దువా ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలతో జాగారం చేస్తారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆయా మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక నమాజులు చేశారు. దువా పఠించారు. పలుచోట్ల మసీదుల్లో సెహరీ అన్నదానం చేశారు. కడప నగరంలోని మస్జిద్‌ ఏ నకా ష్‌, బగ్దాదియా మస్జిద్‌, గుంతబజార్‌, ఏడురోడ్ల మసీదులతో పాటు ఇతర మసీదుల్లో రాత్రంతా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. కాగా ఈ నెల 12, 14, 16, 18వ తేదీల్లో తాఖ్‌రాత్‌ ప్రార్థనలు చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement