కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’’ కార్యక్రమంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని, ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 156 ఫిర్యాదులు(పిజిఆర్‌ఎస్)కు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత పోలీసు అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్‌లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితుల్లో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలని, బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్


