కడప సెవెన్‌రోడ్స్ : హ్యూమన్ పాపిల్లోమవైరస్ (హెచ్‌పీవీ) టీకా కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిఽధి మీనా సూచించారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో హెచ్‌పీవీ టీకా అవగాహన పోస్టర్‌ను ఇతర అధికారులతో కలిసి జేసీ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ హెచ్‌పీవీ వైరస్ గర్భాశయ ముఖ క్యాన్సర్‌కు ప్రధాన కారణమన్నారు.ముఖ్యంగా హెచ్‌పీవీ–16, హెచ్‌పీవీ–18 రకాలు ఎక్కువ కారణమవుతాయని తెలిపారు.క్యాన్సర్‌ను ముందస్తుగా నివారించడంలో హెచ్‌పీవీ టీకా కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు. కడపలో హెచ్‌పీవీ టీకా కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభమవుతుందని, జిల్లా పరిధిలోని అన్ని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలో ఈ కార్యక్రమం నిర్వహించన్నుట్లు, అర్హులైన బాలికలు ఈ టీకా వేయించుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగరాజ తెలిపారు.కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. ప్రవీణ్ ,జిల్లా లెప్రసీ, ట్యూబర్‌క్యులోసిస్ అధికారి డాక్టర్ రవి కుమార్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆరీఫుల్లా పాల్గొన్నారు.


