రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Mar 10 2026 7:34 AM | Updated on Mar 10 2026 7:34 AM

రొంపిచెర్ల : రోడ్డు ప్రమాదంలో రొంపిచెర్ల మండలం గానుగచింత దాసరిగుడెంకు చెందిన సుబ్బరామయ్య (67) మృతి చెందారు. సోమవారం ఉదయం అనంతపురం – చైన్నె జాతీయ రహదారిలో తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం యండపల్లెవారిపల్లె సమీపంలో రోడ్డు దాటుతుండగా బెంగుళూరు నుంచి అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సుబ్బరామయ్య అక్కడిక్కడే మృతి చెందారు. దీంతో గానుగచింత దాసరిగుడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య శంకరమ్మ 7 నెలల కిత్రం ఆనారోగ్యంతో మృతి చెందారు. కాగా అతడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement