వెంకటాద్రికి నందలూరులో స్టాపింగ్‌! | - | Sakshi
Sakshi News home page

వెంకటాద్రికి నందలూరులో స్టాపింగ్‌!

Mar 18 2026 9:40 AM | Updated on Mar 18 2026 9:40 AM

వెంకటాద్రికి నందలూరులో స్టాపింగ్‌!

రాజంపేట: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వే కేంద్రంలో చిత్తూరు–కాచిగూడ (12798–12797)మధ్య నడిచే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ నిలుపుదలకు రైల్వేబోర్డు అధికారులు అంగీకరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని మంగళవారం రైల్వేబోర్డు అధికారులు తనకు తెలియజేశారని ఎంపీ మేడా రఘునాథ రెడ్డి వెల్లడించారు. వెంకటాద్రి సూపర్‌పాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలుపుదల విషయంపై రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి విశేష కృషి చేశారు. రైల్వేబోర్డుకు రైల్వేస్టాడింగ్‌ కమిటీ కౌన్సిల్‌ సభ్యుడి హోదాలో మేడా రఘునాథరెడ్డి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలు హాల్టింగ్‌ అంశంపై ఇటీవల రైల్వేబోర్డు అధికారులతో చర్చించారు. నందలూరు స్టేషన్‌ ప్రాధాన్యత .. ప్రయాణికుల అవసరాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సానుకూలంగా స్పందించిన రైల్వే ఉన్నతాధికారులు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ నిలుపుదలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని.. త్వరలో హాల్టింగ్‌ ఉత్తర్వులు జారీ చేస్తారని మేడా ధృవీకరించారు.

ఏడేళ్లకు వెంకటాద్రి హాల్టింగ్‌కు మోక్షం

కోవిడ్‌–19 కంటే ముందు నందలూరులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్‌ ఉండేది. లాక్‌డౌన్‌ తర్వాత అన్ని రైళ్లను రద్దీ చేసిన అధికారులు.. తిరిగి పునరుద్ధరించే క్రమంలో నందలూరులో హాల్టింగ్‌ను ఎత్తివేశారు. తాజా గా నందలూరులో నిలుపుదలకు రైల్వే బోర్డు అంగీకరించడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

టైమింగ్‌ ఇలా..

కాచిగూడ నుంచి బయలుదేరే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ నందలూరు రైల్వేకేంద్రానికి ఉదయం 4.45 తెల్లవారుజామున చేరుకుంటుంది. తిరుపతికి ఉదయం 6,15, చిత్తూరుకు 8.15 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి చిత్తూరు రైల్వేస్టేషన్‌లో సాయంత్రం 4.30 గంటలు బయలుదేరి 8.15కు నందలూరు రైల్వేకేంద్రానికి చేరుకుంటుంది. కాచిగూడకు ఉదయం 6.గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు నిలుపదలకు కృషిచేసిన ఎంపీ రఘునాథరెడ్డిని ప్రయాణికులు, ప్రజలు అభినందనలు తెలియచేస్తున్నారు.

రైల్వే స్టాండింగ్‌కౌన్సిల్‌కు హాజరైన మేడా

రైల్వేస్టాండింగ్‌ కౌన్సిల్‌ సమావేశానికి హాజరైనట్లు రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రధానంగా భారతీయ రైల్వేరోలింగ్‌ స్టాక్‌ ఉన్నతీకరణ,ఆధునీకరణ అనే అంశంపై జరిగిన సమావేశానికి తాను హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా నందలూరులో వెంకటాద్రి హాల్టింగ్‌ అంశాన్ని ప్రస్తావించగా.., రైల్వేబోర్డు స్పందించిందన్నారు.

రైల్వేబోర్డు నుంచి గ్రీన్‌సిగ్నల్‌!

ఫలించిన రాజ్యసభ సభ్యుడు ‘మేడా’కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement