మదనపల్లెటౌన్ : కుటుంబ సమస్యలతో మహిళ ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం రామసముద్రం మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు మండలంలోని ఎర్రప్పల్లికి చెందిన గురప్ప భార్య శాంతమ్మ(37) కుటుంబ సమస్యలతో ఇంట్లో గొడవపడింది. దీంతో తీవ్ర మనస్థాంచెంది పురుగుల మందుతాగింది. గమనించిన కుటుంబీకులు ఆమెను చికిత్సల నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. రామసముద్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని..
మదనపల్లెటౌన్ : భార్య అలిగి పుట్టినింటికి వెళ్లిందన్న కోపంతో భర్త ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన ఆదివారం కురబలకోట మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కురబలకోట మండలం, తెట్టు గ్రామం, ఆరోగ్యపురానికి చెందిన ప్రభుకుమార్(32) భార్య రవణమ్మ కుటుంబ సమస్యల కారణంగా భర్తతో గొడవపడి, అలిగి రెండు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. కాపురానికి పిలిచినా ఆమె రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రభుకుమార్ పురుగుల మందుతాగాడు. కుటుంబీకులు గమనించి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అతని ఆరోగ్యం కుదుట పడక పోవడంతో తిరుపతి రుయాకు వెళ్లాలని వైద్యులు రెఫర్‌చేశారు. ముదివేడు పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
కుటుంబ సమస్యతో యువకుడు..
మదనపల్లెటౌన్ : పురుగుల మందుతాగి యువకుడు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన ఆదివారం ములకలచెరువు మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకుములకలచెరువు మండలం, పర్తికోటకు చెందిన మంజునాథ్(27), కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లో వారితో గొడవపడ్డాడు. దీంతో తీవ్ర మనస్థాపాఆనికి గురై పురుగుల మందుతాగాడు. గమనించిన కుటుంబీకులు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్తితి విషమంగా ఉండడంతో తిరుపతికి రెఫర్‌చేశారు. ములకలచెరువు పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.


