కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని గవర్నమెంట్, జిల్లా పరిషత్తు, మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీ ప్రొద్దుటూరు పరిధిలో పనిచేస్తున్న సెంకడరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, తత్సమాన కేటగిరీల నుంచి పాఠశాల సహాయకులుగా, పాఠశాల సహాయకులు, తత్సమాన కేటగిరీల నుంచి ప్రధానోపాధ్యాయుగా పదో న్నతి కోసం సీనియారిటి జాబి తాను సబ్జెక్టుల వారీగా డీఈఓ వెబ్‌సైట్ www.kadapa deo.inలో పొందుపరిచినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. సదరు సీనియారిటి జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలోపు రాత పూర్వకంగా సరైన ఆధారాలతో డీఈఓ కార్యా లయంలో సమర్పించాలని సూచించారు.
కడప ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్)–2026 నకు ఈనెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని యోగి వేమన విశ్వవిద్యాలయ ప్రవేశాల సంచాలకులు డాక్టర్ టి. లక్ష్మిప్రసాద్ తెలిపారు. డిగ్రీ ఇప్పటికే పూర్తి చేసుకున్న వారు చివరి సంవత్సరం పరీక్షలు రాయబోయే వారు ఈ వెబ్‌సైట్ https://cets. apsche.ap.gov.inను క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు పొందగోరే విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. వైవీయూలో 29 కోర్సులు ఉన్నాయని ఆయా అర్హతలను బట్టి ఎంపిక చేసుకోవాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే డాక్టర్ పి లక్ష్మిప్రసాద్ సెల్ నెంబర్ (8317532040)ను, డాక్టర్ సరిత (81066 04789)లను సంప్రదించాలని సూచించారు.
కడప సెవెన్‌రోడ్స్: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని 35 మండలాలకు 510 ట్రై సైకిళ్లను మంగళవారం నుంచి పంపిణీ చేస్తున్నామని జెడ్పీ సీఈఓ ఓబులమ్మ తెలిపారు. డిప్యూటీ ఎంపీడీఓలకు మండల ప్రధాన కేంద్రాల్లో నేరుగా ట్రై సైకిళ్లను అందజేస్తామన్నారు. అట్లూరుకు 11, బి.కోడూరు 10, బి.మఠం 10, బద్వేలు 10, చక్రాయపేట 16, చాపాడు 21, చెన్నూరు 9, సీకే దిన్నె11, దువ్వూరు 21, గోపవరం 7, జమ్మలమడుగు 13, కలసపాడు 13, కమలాపురం 14, ఖాజీపేట 20, కొండాపురం 23, లింగాల 19, ముద్దనూరు 17, మైదుకూరు 11, మైలవరం 17, పెద్దముడియం 20, పెండ్లిమర్రి 18, పోరు మామిళ్ల 14, ప్రొద్దుటూరు 10, పులివెందుల 6, రాజుపాలెం 10, కాశినాయన 17, సిద్దవటం 17, సింహాద్రిపురం 20, తొండూరు 14, వల్లూరు 15, వీఎన్ పల్లె 22, వేంపల్లె 15, వేముల 16, ఒంటిమిట్ట 12, ఎరగుంట్ల మండలంలో 11 ట్రైసైకిళ్ల చొప్పున పంపిణీ చేయనున్నట్లు వివరించారు.
హుండీ ఆదాయం లెక్కింపు
బ్రహ్మంగారిమఠం: బి.మఠంలో ఉన్న శ్రీమాతా ఈశ్వరీదేవి మఠంలో సోమవారం హుండీల ఆదాయాన్ని లెక్కించగా రూ 5,09,041 నగదు వచ్చిందని మఠం ఈఓ బివీ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అలాగే తలనీలా కోసం వేలం వేయగా రూ 71వేలు ఆదాయం వచ్చిందని చెప్పారు.
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 16 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ సోమవారం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రొసీడింగ్స్‌జారీ చేశారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి కె.విజయ్‌కుమార్‌నుప్రొద్దుటూరుకు బదిలీ చేశా రు.బద్వేలు తహసీల్దార్ డి.ఉదయభాస్కర్‌రాజు ను పోరుమామిళ్లకు, బి.కోడూరు తహసీల్దార్ యు.దస్తగిరయ్యను రాజంపేటకు, కాశినాయన తహసీల్దార్ వి.వెంకట సుబ్బయ్యను పులివెందు ల ఆర్డీఓ కార్యాలయ ఏఓగా నియమించారు. చె న్నూరు తహసీల్దార్ టి.సరస్వతిని కలెక్టరేట్‌లోని ల్యాండ్ రీఫామ్స్ విభాగ స్పెషల్ తహసీల్దార్‌గా నియమించారు. పులివెందుల ఆర్డీఓ కార్యాలయ ఏఓ జి.రవీంద్రారెడ్డిని కలసపాడు తహసీల్దార్‌గా నియమించారు. సింహాద్రిపురం తహసీల్దార్ కె.వెంకట సాయినాథరెడ్డిని జమ్మలమడుగు, వేంపల్లె తహసీల్దార్ వై.హరినాథరెడ్డిని రాజుపాలెం, జమ్మలమడుగు తహసీల్దార్ పి.శ్రీనివాసరెడ్డిని కమలాపురానికి, ఎర్రగుంట్ల తహసీల్దార్ కె.శోభన్‌బాబును పెండ్లిమర్రికి బదిలీ చేశారు. ప్రొద్దుటూరు తహసీల్దార్ వి.గంగయ్యను కలెక్టరేట్ పరిపాలన అధికారిగా నియమించారు. రాజంపేట తహసీల్దార్ ఎస్.పీర్ మున్నిని బద్వేలు తహసీల్దార్‌గా, నందలూరు తహసీల్దార్ జి.అమరేశ్వరిని ఎర్రగుంట్లకు, సుండుపల్లె తహసీల్దార్ ఎస్.మహబూబ్‌చాంద్‌ను కడపకు బదిలీ చేశారు. వీరు కాకుండా మైలవరం తహసీల్దార్ ఎం.లక్ష్మినారాయణ, కలసపాడు తహసీల్దార్ జీవీ మధురవాణిని బదిలీ చేస్తూ కలెక్టరేట్‌లో రిపోర్టు చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.


