కడప అగ్రికల్చర్: జిల్లాకు సోమవారం 1680 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వర్ రావు తెలిపారు. ఇందులో 1030 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రైవేటు డీలర్లకు కేటాయించగా మరో 650 మెట్రిక్ టన్నులను మార్క్‌ఫెడ్‌కు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలో రైతులెవరు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేడీఏ కార్యాలయ ఏవో గోవర్థన్ తదితరులు పాల్గొన్నారు.
గండికోట బ్యాక్‌వాటర్‌లోకి చేప పిల్లలు
కొండాపురం: మత్య్సశాఖ ఆధ్వర్యంలో 12.30 లక్షల చేపపిల్లలను సోమవారం గండికోట బ్యాక్‌వాటర్‌లో వదిలారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు సి. భూపేష్‌రెడ్డి మాట్లాడుతూ మత్య్సకారులు తప్పకుండా సకాలంలో బీమా రెన్యూవల్ చేసుకోవాలన్నారు. మత్య్సకారులకు ప్రభుత్వం అన్నివిధాలా అభివృద్ధి చేస్తోందన్నారు. ఈకార్యక్రమంలో సి.శివనారాయణరెడ్డి మండల కన్వీనర్ నాగేశ్వర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి చామలు విష్ణువర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు
ముగ్గురు డిబార్
కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం నిర్వహించిన ద్వితీయ సంవత్సర మాథమాటిక్స్ పేపర్–11బీ సంబంధించి జిల్లావ్యాప్తంగా 62 పరీక్షా కేంద్రాలకుగాను 396 మంది గైర్హాజయ్యారు. పులివెందుల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ముగ్గురు విద్యార్థులను డీఈసీ సభ్యులు డిబార్ చేసినట్లు ఆర్‌ఐవో వెంకటేశ్వర్లు తెలిపారు.


