అందాల నెలవు.. ప్రమాదాల కొలువు | - | Sakshi
Sakshi News home page

అందాల నెలవు.. ప్రమాదాల కొలువు

Mar 13 2026 7:59 AM | Updated on Mar 13 2026 7:59 AM

చల్లనికొండపై మంటలు!

హార్సిలీహిల్స్‌లో వరుస కారు ప్రమాదాలు

మంటలతో కాలి బూడిదైన ఒక టెంపో,

రెండు కార్లు

ట్రాఫిక్‌ నిబంధనలు

ఉల్లంఘిస్తే చర్యలు:ఎస్పీ

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ హెచ్చరించారు. గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 270 కేసులు నమోదు చేసి, రూ. 56,215 జరిమానా విధించినట్లు ఎస్పీ తెలిపారు.

వివాహిత ఆత్మహత్య

రాజంపేట : మండలంలోని బోయనపల్లెలో గురువారం రైల్వేలోకోౖపైలెట్‌ శ్రీరాంశ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఆత్మహత్య చేసుకుంది. మన్నూరు పోలీసులుఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టరం నిమిత్తం రాజంపేట ప్రాంతీయవైద్యశాలకు తరలించారు.కృష్ణవేణి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

లాయర్‌ సతీష్‌పై దాడి

పులివెందుల రూరల్‌ : పులివెందుల పట్టణంలోని స్థానిక పాత బస్టాండు వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో నివాసం ఉంటున్న లాయర్‌ సతీష్‌పై రామిరెడ్డి శివానందరెడ్డి అనే వ్యక్తి కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సతీష్‌ 8 ఏళ్ల నుంచి లాయర్‌గా ఉంటూ నోటరీ కూడా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో లాయర్‌ సతీష్‌ ఆఫీస్‌కు రామిరెడ్డి శివానందరెడ్డి, అతని భార్య రామిరెడ్డి జ్యోతిలు అఫిడవిట్‌ చేయించుకోవడానికి వెళ్లారు. లాయర్‌ సతీష్‌ అఫిడవిట్‌ కంప్యూటర్‌లో తయారుచేసి శివానందర్‌ రెడ్డికి ఇచ్చారు. ఆఫిడవిట్‌ను తయారు చేసినందుకు శివానందరెడ్డిని డబ్బులు అడగగా.. ఆయన నీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలని దుర్భాషలాడాడు. అక్కడే ఉన్నా లాయర్‌ సతీష్‌ భార్య కూడా ఎందుకు బూతులు మాట్లాడుతున్నావని అడగగా.. ఆమైపె కూడా అసభ్యకరమైన పదజాలాలతో మాట్లాడారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివానందరెడ్డి లాయర్‌ సతీష్‌ను చేతులతో కొట్టడంవల్ల కళ్లజోడు విరిగిపోయింది. కంటి కింద గాయాలయ్యాయి. లాయర్‌ భార్య అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చేలోపు శివానందరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. శివానందరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉప్పరపల్లిలో భూవివాదం:ఉద్రిక్తత

సిద్దవటం : మండలంలోని ఉప్పరపల్లె గ్రామంలో గురువారం భూవివాదం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒంటిమిట్ట మండలానికి చెందిన టీడీపీ ప్రధాన నాయకుడి అనుచరుడు కరమళ్ల మహీంబాషా గ్రామంలోకి వచ్చి భూమి విషయంలో వివాదానికి దిగినట్లు తెలుస్తోంది. పెద్దపల్లి రెవెన్యూ గ్రామ సర్వే నంబర్‌ 936లో ఉన్న 20 సెంట్ల తమ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇరువర్గాల మధ్య గత నెల రోజులుగా గొడవలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆగ్రహంతో కరమళ్ల మహీంబాషాను అడ్డుకొని చితకబాది తరిమికొట్టినట్లు సమాచారం. ఘటన అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికే నెల రోజులుగా ఈ వివాదం కొనసాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూసమస్యపై వెంటనే స్పందించి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

దాడి చేశారని ఫిర్యాదు

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : కడప నగరం ఎర్రముక్కపల్లెలోని కందిపాలెంలో ఉన్న తమ ఇంటి స్థలంలో కొందరు బలవంతంగా ఇల్లు నిర్మిస్తుంటే.. ఎందుకు నిర్మిస్తున్నారని ప్రశ్నించినందుకు తమపై దాడి చేశారని సగిలి గుర్రమ్మ వన్‌టౌన్‌ సీఐకి ఫిర్యాదు చేశారు. ఈనెల 10వ తేదీ తమ స్థలంలో భారవితోపాటు ఎన్‌.వెంకట శివ, వి.భాగ్యలక్ష్మి తదితరులు తమపై దాడి చేసి పిడిగుద్దులు కురిపించారన్నారు. గతనెల రోజులుగా స్థల వివాదం జరుగుతోందని, పోలీసులు, రెవెన్యూ వారి ఉత్తర్వుల మేరకు ఆ స్థలంలో ఎటువంటి కట్టడాలు, నిర్మాణాలు జరపకూడదని చెప్పినందువల్ల మేము, మా కుటుంబ సభ్యులం ఆ స్థలం వద్దకు పోలేదన్నారు. కానీ భారవి, భాస్కర్‌లు కిరాయి రౌడీలతో కలిసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారన్నారు. వాటిని ప్రశ్నించినందుకు తమపై దాడి చేశారన్నారు. తమపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

గూడ్స్‌ రైలు కిందపడి వ్యక్తికి గాయాలు

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : కడప నగర పరిధి చలమారెడ్డిపల్లెకు చెందిన జయరామిరెడ్డి అనే వ్యక్తి గురువారం సాయంత్రం గూడ్స్‌ రైలు కిందపడి గాయపడ్డాడు. కడప రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని కడప రిమ్స్‌కు తరలించారు.

బి.కొత్తకోట : మండలంలోని చల్లటికొండ హార్సిలీహిల్స్‌కు విహారానికి వచ్చే సందర్శకులకు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆందోళనకర పరిస్థితి నెలకొంటోంది. ఎన్నడూ జరగనన్ని ప్రమాదాలు ఇటీవల చోటుచేసుకున్నాయి. పెను ప్రమాదాలు సంభవిస్తున్నా అదృష్టవశాత్తు ప్రాణాలకు ప్రమాదం జరగడంలేదు. గాయాలతో బయటపడుతున్నారు. హార్సిలీకొండ ఘాట్‌రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతుండగా ఇటీవల కార్లు మంటలతో కాలి బూడిద అవుతున్నాయి.

టెంపో, కార్లు దగ్ధం

కొండకు జిల్లాతోపాటు సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, వైఎస్సార్‌ కడప జిల్లాలు, తమిళనాడు, కర్ణాటకలకు చెందిన సందర్శకులు అధికంగా వస్తుంటారు. వీరంతా కార్లలోనే కొండపైకి చేరుకుంటారు. కాండ్లమడుగు నుంచి కొండపై 9 కిలోమీటర్ల ప్రమాదకరమైన ఘాట్‌రోడ్డులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రమాదకరమైన మలుపుల్లో ఘాట్‌రోడ్డుపై అవగాహన ఉంటే కార్లు నడిపేందుకు ఇబ్బంది లేదు. లేకపోతే ప్రమాదాలను ఆహ్వనించినట్టే. ప్రశాంత వాతావారణంలో సేద తీరేందుకు వస్తూ ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. 2013లో ఒక టెంపో ఘాట్‌రోడ్డులో పైనుంచి కిందకు వచ్చే మొదటి మలుపు తర్వాత కాలి బూడిదైపోయింది. 2018లో కడపకు చెందిన పర్యాటకులు కారులో వస్తుండగా ఘాట్‌రోడ్డుపై కారులో మంటలు వ్యాపించడంతో కాలిపోయింది. బుధవారం పుంగనూరుకు చెందిన పర్యాటకులు కారులో రాగా కొత్త వ్యూపాయింట్‌ వద్ద అదుపుతప్పిన కారు కిందపడి కాలిపోయింది. ఇలాంటి ఘటనలతో పర్యాటకులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయంలో పోలీసు, రవాణా శాఖ అధికారులు స్పష్టమైన చర్యలు చేపట్టాల్సిన అసవరం ఉంది. అలాగే ఘాట్‌రోడ్డుకు ఇరువైపులా మొక్కలు, చెట్ల కొమ్మలు కమ్మేస్తున్నాయి. దీంతో దూరంగా వస్తున్న వాహనాలకు రోడ్డు కనిపించడం లేదు. వేగ నియంత్రణపై పోలీసులు నిబంధనలు అమలు చేస్తూ కఠినంగా వ్యవహరించాల్సి ఉంది.

కారు దగ్ధంపై విచారణ

బి.కొత్తకోట: మండలంలోని హార్సిలీహిల్స్‌పై బుధవారం సాయంత్రం కారు దగ్ధమైన ఘటనపై గురువారం సీఐ గోపాల్‌రెడ్డి విచారణ జరిపారు. కొత్త వ్యూపాయింట్‌ వద్ద వెనుక్కు తిప్పుకునే ప్రయత్నంలో కింద ఉన్న బండపైకి దూసుకెళ్లి కాలిపోయింది. పుంగనూరుకు చెందిన కారు యజమాని, కారులో వచ్చిన డ్రైవర్లను సీఐ విచారించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలను సేకరించారు.

ప్రధాన సంఘటనలు

కర్ణాటక సందర్శకులు తిరుపతి నుంచి కారులో వస్తూ కొండను ఢీకొట్టడంతో పల్టీలు కొట్టింది.

కడపకు చెందిన సందర్శకులు కారు సైలెన్సర్‌లో మంటలతో దగ్ధమైపోయింది.

మదనపల్లెకు చెందిన కారు రోడ్డుపై ఇసుక కారణంగా బోల్తా కొట్టింది.

రాత్రివేళ కొండ దిగుతున్న కారు పైప్‌లైన్‌ వద్ద చెట్టును ఢీకొనగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

9వ మలుపు వద్ద మదనపల్లెకు చెందిన పర్యాటకుల ఇన్నోవా లోయలోకి పడబోతూ తప్పించుకొంది. ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు.

పైప్‌లైన్‌ మలుపువద్ద మదనపల్లెకు చెందిన కారు ప్రమాదానికి గురై ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

గంగోత్రి వద్ద అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఇద్దరు పర్యాటకులు ప్రమాదానికి గురై గాయపడ్డారు.

వివేకానంద విగ్రహం వద్ద నిలిపి ఉంచిన క్వాలిస్‌ కారు దొర్లుకొంటూ లోయలోకిపడి ధ్వంసమైంది. ఇందులో ఎవరూ లేరు.

జిడ్డుకృష్ణమూర్తి సర్కిల్‌ వద్ద కారు నిలిపివుంచినా అది కాటేజీవైపు దూసుకెళ్లి చెట్టును ఢీకొంది. ఇందులో ఎవరూ లేరు.

తొలి ఘాట్‌మలుపులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

గంగోత్రివద్ద కర్ణాటక కారు ప్రమాదంలో ఇద్దరు సందర్శకులు గాయపడ్డారు.

బెంగళూరు నుంచి వస్తున్న కారు–ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగినా ఎవరికి గాయాలు కాలేదు.

రెండోఘాట్‌ మలుపులో కారు, ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

గంగోత్రి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు.

తిరుమల ఎత్తు ఘాట్‌వద్ద తమిళనాడుకు చెందిన కారు అదుపుతప్పి లోయలో పడింది.

గంగోత్రి–రెండో ఘాట్‌ మధ్యలో కారు అదుపుతప్పి కొండను ఢీకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement