మదనపల్లె రూరల్ : ఆంధ్రప్రదేశ్ సర్వే ఎంప్లాయిస్ అసోసియేషన్, అన్నమయ్యజిల్లా కార్యవర్గ సభ్యుల ఎన్నిక ఆదివారం జిల్లా సర్వే కార్యాలయ ఆవరణలో జరిగింది.
జిల్లా ఎన్నికల అధికారి ఏ.సోమశేఖర్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ వై.ఎస్.సలీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా పుంగనూరు మండల సర్వేయర్ బి.శ్రీనివాసులునాయక్, కార్యదర్శిగా గుర్రంకొండ మండల సర్వేయర్ జి.కిరణ్మయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీలో మదనపల్లె మండల సర్వేయర్ బీ.వి.సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షులుగా, చౌడేపల్లె విలేజ్ సర్వేయర్ బి.సురేంద్రనాయక్ జాయింట్ సెక్రటరీ, ములకలచెరువు మండల సర్వేయర్ ఎస్.మహమ్మద్ రఫీ ట్రెజరర్‌గా, డిస్ట్రిక్ట్ సర్వే కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ సుజిత్ కుమార్, పెద్దమండ్యం మండల సర్వేయర్ ఎస్.హసీన్‌తాజ్, రాయచోటి విలేజ్ సర్వేయర్ ఎం.భారతి, పుంగనూరు విలేజ్ సర్వేయర్ బి.రామమూర్తి, జిల్లా సర్వే కార్యాలయం చైన్‌మెన్ బి.గంగయ్య, మదనపల్లె విలేజ్ సర్వేయర్ వై.చక్రపాణి నాయుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా ఎన్నికయ్యారు. అన్నమయ్యజిల్లాలో సర్వేశాఖకు సంబంధించిన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నూత న కార్యవర్గం కృషి చేస్తుందని సభ్యులు తెలిపారు.


