రాజంపేట : సేవా భావం అలవర్చుకుంటే వైద్య వృత్తిలో రాణిస్తారని అన్నమాచార్య యూనివర్సిటీ అధినేత, చాన్స్‌లర్ చొప్పా గంగిరెడ్డి తెలిపారు. మంగళవారం అన్నమాచార్య యూనివర్సిటీలోని పార్మసీ కళాశాలలో విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమాచార్య యూనివర్సిటీ విద్యార్థులను ప్రపంచస్థాయి నైపుణ్యాలతో తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తోందన్నారు. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు జగన్‌మోహన్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వైద్య సైన్స్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ రంగంలో ఉన్న వారికి సానుభూతి, సహానుభూతి అత్యంత అవసరమన్నారు. ఒక వైద్యసేవకుడు కేవలం చికిత్స చేయడమే కాదు, రోగికి మానసికంగా ధైర్యం చెప్పగలిగే వ్యక్తిగా ఉండాలని సూచించారు. ప్రాక్టికల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకున్నప్పుడే నేటి సమాజంలో విద్యార్థులు రాణించగలరన్నారు. ఏయూ వీసీ డా.సాయిబాబా మాట్లాడుతూ విద్యతోపాటు విలువలు కూడా నేర్చుకోవడా న్ని విద్యార్థులు అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం జాసిమ్, కీర్తనా, అనీసా విద్యార్థులకు ప్రశంసాపత్రాలను చొప్పా గంగిరెడ్డి, డా.జగన్‌మోహన్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, ఇన్‌చార్జి డా.ద్వారకనాథరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


