మదనపల్లెటౌన్ : సెల్ ఫోన్ పోయిందంటే ఇక రాదు అనే పాత నమ్మకాన్ని చెరిపేస్తూ, అన్నమయ్య జిల్లా పోలీసులు అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని ఒకే విడతలో రూ.1.54,36 కోట్లకు పైగా విలువచేసే 716 సెల్ ఫోన్లను రికవరీచేశారు. బుధవారం జిల్లా కేంద్రం మదనపల్లెలో జరిగిన తొమ్మిదో విడత సెల్ ఫోన్ల రికవరి మేళాలో బాధితులకు కర్నూల్ రేంజి డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రిలు కలిసి బాధితులకు ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లాలో రూ.6.20 కోట్ల విలువైన 2,953 సెల్ ఫోన్లను రికవవరీ చేసి ప్రజలకు అప్పగించినట్లు చెప్పారు.సెల్ పోన్లను రికవరీ చేయడంలో ప్రతిభ కనబరచిన క్రైం సిఐ మహమ్మద్ అలీ, ఛంద్రశేఖర్ వారి సిబ్బందిని అభినందించారు.
● ఫోన్ పోతే పోలీస్ స్టేషన్‌కు రానవసరం లేదన్నారు. కేవలం 86888 30012 వాట్సాప్ నంబర్‌కు హాయ్ అని మేసేజ్ పంపితే మీరు పోగొట్టుకున్న ఫోన్‌ను మేమే వెతికిస్తామని తెలిపారు. ఈ సేవలకు ఎవరైనా డబ్బు అడిగితే ఇవ్వొద్దని, సేవలన్నీ పూర్తిగా ఉచితమని చెప్పారు.
● వాట్సాప్ ద్వారా 8688830012 కుమెసేజ్ పంపి వివరాలు నమోదు చేయాలని జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. ఆన్ లైన్ ద్వారా www.ceir.gov.in వెబ్‌సైట్‌లో మీ ఫోన్‌ను వెంటనే బ్లాక్ చేయాలన్నారు.


