కారు,ట్రావెల్స్‌ బస్సు ఢీ | - | Sakshi
Sakshi News home page

కారు,ట్రావెల్స్‌ బస్సు ఢీ

Mar 15 2026 5:09 AM | Updated on Mar 15 2026 5:09 AM

మృతి చెందిన పవన్‌కుమార్‌

మేనక మృతదేహం

కడప అర్బన్‌ : కడప నగర శివారులోని కడప– తిరుపతి హైవేలో ఈనెల 13వ తేదీ రాత్రి హెచ్‌పీ పెట్రోల్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌, టాటా షోరూం సమీపంలో కారును, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కడప ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ సురేష్‌ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పల్లిపట్టు గ్రామానికి చెందిన పవన్‌ కుమార్‌ (27), నాగ మేనక (28)తో పాటు బెంగళూరు నగరానికి చెందిన వెంకటరాజు (54), సాయి (26) కారులో తమ గ్రామం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళుతుండగా కడపలో ఎదురుగా ట్రావెల్స్‌ బస్సు వేగంగా వచ్చి కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప ట్రాఫిక్‌ సీఐ తెలిపారు.

ఇద్దరు దుర్మరణం, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement