నార్త్ ఇండియన్ ఫుడ్, టిఫెన్ ఐటమ్స్ తయారీ ఇక చేయలేం. స్థలం తక్కువగా ఉండే కిచెన్‌లో ఎక్కువ పొయ్యిలు ఉపయోగించలేం. ఐటమ్స్ తగ్గడం వల్ల పనివాళ్ల సంఖ్యను సైతం మేము తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇందువల్ల పలువురి ఉపాధి దెబ్బతింటుంది. టర్నోవర్ తగ్గడం వల్ల నష్టాలు వచ్చి ఒక దశలో హోటళ్లు మూతపడే అవకాశం లేకపోలేదు.వంట గ్యాస్ ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు టూరిజంపైన ఉంటుంది.
– టంగుటూరి చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ,
ఏపీ స్టేట్ హోటల్స్ అసోసియేషన్, కడప
వంట గ్యాస్ కమర్షియల్‌కు
వినియోగిస్తే చర్యలు
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపధ్యంలో వంట గ్యాస్‌ను జాగ్రత్తగా వాడుకోవాలి. ఎవరైనా గృహావసరాలకు కేటాయించిన గ్యాస్‌ను కమర్షియల్‌కు వాడితే కఠిన చర్యలు తీసుకుంటాం. డైవర్షన్‌కు పాల్పడే రీ ఫిల్లింగ్ సెంటర్లు, ఏజెన్సీలపై చర్యలు తప్పవు. సింగిల్ సిలిండర్ కలిగిన వినియో గదారులు 25 రోజులకు, డబల్ సిలిండర్ కలిగిన వినియోగదారులు 30 రోజులకు ఒకసారి ఇకపై బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కంప్రెస్డ్ నేచ్యురల్ గ్యాస్ (సీఎన్‌జీ) వినియోగించే వాహనాలకు ప్రస్తుతానికి ఇబ్బంది ఉండదని భావిస్తున్నాం.
–రఘురాం, జిల్లా పౌరసరఫరాల అధికారి, కడప


