గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థులు క్రీడలు ఆడుకునేందుకు అధికారులు నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన చుండు సుధీర్ దర్జాగా ఆక్రమించుకున్నా గతంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్‌లుగా పనిచేసిన వారు సైతం ఎలాంటి చర్యలు తీసుకోలేక పోయారు. కోట్లాది రూపాయిల క్రీడామైదానం ఆక్రమించుకున్నా పట్టించుకోకుంటే ఎలా?. వైఎస్సార్ జిల్లా కలెక్టరయినా చర్యలు తీసుకొని కోట్లాది రూపాయిల ప్రభుత్వ భూమిని కాపడటంతో పాటు ఆ క్రీడామైదానం భూమిని గిరిజన ఆశ్రమ పాఠశాలకు కేటాయించాలి. –గొంటు మణి,
వైఎస్సార్ సిపి ఎస్సీసెల్
జిల్లా ప్రధాన కార్యదర్శి, రాజంపేట


