బైక్‌ దొంగ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ దొంగ అరెస్టు

Mar 19 2026 7:44 AM | Updated on Mar 19 2026 7:44 AM

జమ్మలమడుగు : బైక్‌ దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని పెద్దముడియం పోలీసులు అరెస్టు చేసి దొంగ నుంచి బైకులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం రూరల్‌ సీఐ భాస్కర్‌రెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెద్దముడియం మండలంలోని పాలూరు బైపాస్‌ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీలను నిర్వహించగా అనుమానాస్పదంగా తిరుగుతున్న సరావు భాస్కరాచారిని అదుపులోకి తీసుకున్నారు. అతను వృత్తి పరంగా బైక్‌ మెకానిక్‌. అతని వద్దనుంచి ఆరుబైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. తమ విచారణలో ఆదోని, తాడిపత్రి, గుత్తి, ఉరవకొండ,దేవనకొండ, కౌతాలం,విడవనకల్లు, పత్తికొండ, ఆటూరు, పెద్దపప్పురు, మద్దికేర, తుగ్గలి, కసాపురం, గుంతకల్లు, మంత్రాలయం పోలీసుల స్టేషన్‌ పరిధిలో మోటర్‌, హుండీ దొంగతనాలు చేసినట్లు తేలిందన్నారు.ఈ కార్యక్రమంలోఎస్‌ఐ సుబ్బారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement