కేజీబీవీ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

Mar 18 2026 11:06 AM | Updated on Mar 18 2026 11:06 AM

సింహాద్రిపురం : మండల కేంద్రమైన సింహాద్రిపురం సమీపంలోని నిడివెల్ల వద్ద ఉన్న కస్తూరర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 12 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని పాఠశాల ఎస్‌ఓ గురుదేవి తెలిపారు. మంగళవారం ఆమె తెలుపుతూ 6వ తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 40సీట్లు, రెండవ సంవత్సరంలో ఖాళీగా ఉన్న 9 సీట్లకు ఏప్రిల్‌ 1వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఏప్రిల్‌ 13న ఎంపికై న విద్యార్థుల జాబితా, ఏప్రిల్‌ 13 నుంచి 17 వరు విద్యాలయాల్లో విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 9948454910 ఫోన్‌ నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

కై జిన్‌– 2కే26లో విజేతలకు ప్రశంసలు

కడప ఎడ్యుకేషన్‌ : నంద్యాలలోని ఆర్జీఎం కాలేజీలో కై జిన్‌– 2కే26 పేరుతో నిర్వహించిన మేనేజ్‌మెంట్‌ మీట్‌లో యోగివేమన విశ్వవిద్యాలయం మేనేజ్‌మెంట్‌ విభాగ విద్యార్థులు ప్రతిభ చాటి బహుమతులు అందుకున్నారు. వారిని ఆ శాఖ విభాగ అధిపతి డాక్టర్‌ పి.సరిత అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యంగ్‌ మేనేజర్‌ ఈవెంట్‌లో పి.గురుబాయి, జి.వైష్ణవి, బి.రూపాదేవి, కె.పూర్ణ విజేతలుగా నిలిచి, నగదు బహుమతి పొందారని చెప్పారు. పేపర్‌ ప్రజెంటేషన్‌లో పి.శ్వేత, యస్‌.చరిత రెండవ స్థానంలో నిలిచి నగదు బహుమతి అందుకున్నారన్నారు. బజ్‌ స్పార్క్‌ పోటీలో బి.నందిని, ఎం.వినోద్‌ కుమార్‌, డి.విక్రాంత్‌, ఎ.చైతన్య తృతీయ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. వారిని మేనేజ్‌మెంట్‌ శాఖలోని అధ్యాపకులు ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement