వీసీ ఆచార్య రాజశేఖర్
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో, సమాజానికి మరింత చేరువయ్యేలా తీర్చిదిద్దాలని ఉపకులపతి (వీసీ) ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ స్పష్టం చేశారు. మంగళవారం వీపీ చాంబర్‌లో వెబ్‌సైట్‌లోని నూతన మీడియా కార్నర్‌ను కులసచివులు ఆచార్య పి.పద్మ, ఐటీ సెల్ డైరెక్టర్ తుమ్మలకుంట శివతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ సమాచారం ప్రజలకు సులువుగా అందుబాటులో ఉండాలని, పబ్లిక్‌కు అవసరమైన ప్రతి అంశం వెబ్‌సైట్‌లో కనిపించాలని సూచించారు. మీడియా కార్నర్‌లో ఎప్పటికప్పుడు తాజా సమాచారం మరియు వర్సిటీ ఈవెంట్స్ వివరాలను అందుబాటులో ఉంచాలని బాధ్యులను ఆదేశించారు. ఐటీ సెల్ డైరెక్టర్ శివ వెబ్‌సైట్‌లో కొత్తగా చేర్చబోయే విభాగాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మీడియా కార్నర్ బాధ్యులు డాక్టర్ తుమ్మలూరు సురేష్ బాబు, రఖీబ్ పాల్గొన్నారు.


