రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, మరియు ఆధార్‌తో లింక్ అయిన ఫోన్ నంబర్‌ను తీసుకుని సమీపంలోని రైతు సేవా కేంద్రం (ఖఓ)లో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (అఅ)ని సంప్రదించాలి. అక్కడ వివరాలు నమోదు చేయగానే 11 అంకెల ఐడీ కేటాయించబడుతుంది.
రైతు ఐడీ లేని వారు భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు పొందే అవకాశం ఉండదు. తమ గ్రామంలో నివసించకపోయినా, భూమి ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా ఈ నెల చివరిలోపు ఐడీ తీసుకోవాలి. దీనిపై మండల వ్యవసాయ అధికారులతో అవగాహన కల్పిస్తున్నాం.
– మట్టా సుబ్రమణేశ్వరావు,
జిల్లా వ్యవసాయ అధికారి.


