వీరబల్లి : వీరబల్లి మండలం, కోనేటివాండ్లపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో వీరబల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ సి సుస్మిత, టి సుండుపల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ హుస్సేన్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఆదివారం గాలింపు చేపట్టారు. ఈ విషయం తెలసుకున్న స్మగ్లర్లు పరారయ్యేందుకు ప్రయత్నించగా పోలీసులు ముగ్గురిని పట్టుకున్నారు.వారిని విచారించగా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారు. వారు దాచిపెట్టిన 13 ఎర్రచందనం దుంగలు, మూడు కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.


