ప్రొద్దుటూరు క్రైం : ఆటో దొంగ అనిల్‌కుమార్‌ను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సీఐ వంశీనాథ్ బుధవారం సాయంత్రం వివరాలు మీడియాకు వెల్లడించారు. కడపలోని ఎన్‌జీఓ కాలనీకి చెందిన తుమ్మలూరు అనిల్‌కుమార్ ఆటో నడుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే అతను ఆటోలను చోరీ చేయడం అలవాటు చేసుకున్నాడు. పార్క్ చేసిన ఆటోలను చాకచాక్యంగా స్టార్ట్ చేసుకొని దొంగలించుకొని వెళ్తుంటాడు. రైల్వేకోడూరు, చిన్నచౌక్, తిరుపతి ఈస్ట్, తిరుపతి వెస్ట్, తిరుచానూరు పోలీస్‌స్టేషన్లలో అతనిపై ఆటో చోరీ కేసులు ఉన్నాయి. ఈ నెల 8న ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రి వద్ద పార్క్ చేసిన ఒక ఆటోను, కడపలోని కొత్తబస్టాండు, గోకుల్‌లాడ్డి వద్ద నిలిపి ఉన్న రెండు ఆటోలను చోరీ చేశాడు. ఈ క్రమంలో టూ టౌన్ ఎస్‌ఐలు మహబూబ్‌బాషా, రాఘవేంద్రారెడ్డిలు సిబ్బందితో కలిసి బుధవారం ప్రకాష్‌నగర్ క్రాస్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో అక్కడికి వచ్చి అనిల్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనిల్‌కుమార్‌పై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు సీఐ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరచిన సీఐ, ఎస్‌ఐ, సిబ్బందిని ఏఎస్పీ విభూకృష్ణ అభినందించారు.
మూడు ఆటోలు స్వాధీనం


