కాశినాయన క్షేత్రంలో కూలగొట్టిన కట్టడాలను తిరిగి నెల రోజుల్లోపల నిర్మిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఏడాది అవుతున్నా ఇంతవరకు హామీలు నెరవేర్చలేదు. చిన్న కట్టడం కట్టి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికై నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. – కె. ప్రతాప్ రెడ్డి,
వరికుంట్ల గ్రామం, కాశినాయన మండలం
కూల్చిన కట్టడాలను పునర్నిర్మించాలి
కాశినాయన క్షేత్రంలో కూలగొట్టిన కట్టడాలను ఇచ్చిన హామీ ప్రకారం పునర్నిర్మించాలి. సంఘటన జరిగి ఏడాది పూర్తయినా కూల్చేసిన కట్టడాలను నిర్మించలేదు. మంత్రి లోకేష్ చొరవ తీసుకుని కట్టడాలను పునర్నిర్మించాలి.–హనుమంతరెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్. కాశినాయన మండలం


