రాజంపేట : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో వైద్యరంగానికి స్వర్ణయుగమని వైఎస్సార్‌సీపీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి అన్నారు. పులివెందులలో నిర్మితమైన మెడికల్ కాలేజీని సందర్శించి, పులకించిపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెడికల్ కాలేజీల వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేశారన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహనరెడ్డి మెడికల్ కళాశాలలను పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి తీసుకొచ్చారన్నారు. దీనివల్ల అనేక పేద మంది విద్యార్థులు మెడికల్ సీటు కూడా కోల్పోయారన్నారు. అలాగే వైద్యరంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారన్నారు. కరోనా సమయంలో చంద్రబాబు హైదరాబాదుకు వెళ్లిపోయారన్నారు. అయితే జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఏపీలో ఉండి, ఎందరో ప్రాణాలను కాపాడేందుకు వైద్యరంగాన్ని మరింతగా బలోపేతం చేశారన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి, అపవాదును మూటకట్టుకున్నారన్నారు. చరిత్ర హీనుడిగా మిగిలిపోయారన్నారు. ఇప్పుడు వైద్యశాఖలో ఏ ఒక్కరిని కదిలించినా తమకు వైఎస్సార్‌సీపీ పాలనలో గుర్తింపు వచ్చిందన్నారు. ఇప్పుడు కూటమి పాలనలో వైద్యరంగం సిబ్బంది అసంతృప్తిలో ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వం నామమాత్రమే అని, అంతా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుదేనన్నారు. నేటి సమాజంలో వైద్యరంగం ప్రాముఖ్యత తెలుసునన్నారు. ఆ రంగాన్ని నేడు నిర్వీర్యంగా మార్చడానికి కారకులు చంద్రబాబే అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళ నాయకురాలు పాల్గొన్నారు.


