కడప రూరల్: నిరుపయోగంగా ఉన్న 104 సంచార వాహనాల వేలం పాటను నిర్వహిస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. సోమవారం స్థానిక ఆ శాఖ జిల్లా కార్యాలయంలోని చాంబర్‌లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పరిమితి దాటి నిరుపయోగంగా ఉన్న 104 సంచార వాహనాలను ఈ నెల 25వ తేదీన ఉదయం 11 గంటలకు వేలం వేయుటకు కమిటీ తీర్మానం చేసిందన్నారు. మొత్తం 17 వాహనాలను నిబంధనల మేరకు వేలం వేస్తామన్నారు. అనుమతి పొందిన వేలం పాటదారులు కొనుగోలు.ఏపీ.జీఓ.ఇన్ లో కనీస రుసుము చెల్లించి వేలంలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఏఓ విజయ భాస్కర్, డాక్టర్.ప్రవీణ్ కుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ ఖాన్, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ ధీలేశ్వరరావు పాల్గొన్నారు.


