వైఎస్సార్‌, జగన్‌ల కృషితోనే కడప ప్రగతి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌, జగన్‌ల కృషితోనే కడప ప్రగతి

Mar 18 2026 9:40 AM | Updated on Mar 18 2026 9:40 AM

వైఎస్సార్‌సీపీ నుంచి ఐదుగురి బహిష్కరణ

కడప కార్పొరేషన్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిల హయాంలోనే కడప నగరం సర్వతోముఖాభివృద్ధి సాధించిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కడప నగర పాలక సంస్థ ఆవరణలో నిర్వహించిన మూడవ పాలకవర్గ వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

అభివృద్ధి పథంలో నగరం

2005లో వైఎస్సార్‌ హయాంలో రూ. 1,582 కోట్లు, 2019 నుంచి జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రూ. 2,272 కోట్లు వెచ్చించి కడపను తీర్చిదిద్దారని రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు, స్మశానాలు, పార్కుల అభివృద్ధి, రోడ్ల విస్తరణ వైఎస్సార్‌ వల్లే సాధ్యమైందన్నారు. జగన్‌ హయాంలో కొత్త పార్కులు, వరద ముంపు నివారణకు డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టామన్నారు. రాబోయే ఎన్నికల్లో అందరూ మళ్లీ కార్పొరేటర్లుగా గెలవాలని ఆయన ఆకాంక్షించారు.

కృతజ్ఞతలు తెలిపిన మేయర్‌:

మేయర్‌ పాకా సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. సామాన్యుల సమస్యలపై గొంతెత్తడం వల్లే తనకు మేయర్‌ అవకాశం దక్కిందన్నారు. ఈ అవకాశం ఇచ్చిన వైఎస్‌ జగన్‌కు, సహకరించిన నాయకులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. కడప అభివృద్ధిలో మూడు పాలకవర్గాల కృషి ఉందన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్లు ముంతాజ్‌బేగం, నిత్యానందరెడ్డి, కమిషనర్‌ రాకేష్‌ చంద్ర ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఈఈ విజయ్‌కుమార్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. చివరగా కార్పొరేటర్లను ఘనంగా సత్కరించారు.

సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్లు, వైఎస్సార్‌ సీపీ నాయకులు, అధికారులు

వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్‌రెడ్డి

కడప కార్పొరేషన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి తెలుగుదేశం పార్టీలో చేరిన ఐదుగురు నాయకులపై పార్టీ అధిష్టానం వేటు వేసింది. ఐదేళ్లపాటు పార్టీలో పదవులు అనుభవించి, ఇప్పుడు పార్టీ ఫిరాయించినందుకు వారిని సస్పెండ్‌ చేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో బండి జయమ్మ (5వ డివిజన్‌ కార్పొరేటర్‌), ఎస్‌. శివకోటిరెడ్డి (12వ డివిజన్‌ కార్పొరేటర్‌), ఎం. రామలక్ష్మణ్‌రెడ్డి (13వ డివిజన్‌ కార్పొరేటర్‌), ఓ. బాలకొండయ్య (నగర ఉపాధ్యక్షుడు), నాగేంద్రారెడ్డి (46వ డివిజన్‌)లున్నారు. పార్టీ నిబంధనలను అతిక్రమించి ఇతర పార్టీలోకి వెళ్లడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవీంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి

ఘనంగా కడప కార్పొరేషన్‌ మూడవ పాలకవర్గ వీడ్కోలు సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement