బాధితులకు న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

బాధితులకు న్యాయం చేయాలి

Mar 17 2026 7:44 AM | Updated on Mar 17 2026 7:44 AM

కడప అర్బన్‌ : జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ ఆదేశాల మేరకు కడప జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని పెన్నార్‌ పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాలులో పోలీసు అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.కడప స్పెషల్‌ బ్రాంచ్‌ డిఎస్పీ సుధాకర్‌ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 97 ఫిర్యాదులు పీజీఆర్‌ఎస్‌కు వచ్చాయి.అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మహిళా పీఎస్‌ డీఎస్పీ ఈ.బాలస్వామిరెడ్డి, డీటీసీ డీఎస్పీ అబ్దుల్‌ కరీం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement