ప్రొద్దుటూరు క్రైం : పాపం వారు ఇరువురు వృద్ధులు.. వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తుంటారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రిలో చేర్పించి వెళ్లిపోయారు. చికిత్స పొందుతూ వృద్ధులు మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఎవ్వరూ రాకపోవడంతో వారి మృతదేహాలను జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. సంజీవనగర్‌కు చెందిన అనసూయాదేవి (60)ని ఈ నెల 5న హాస్పిటల్‌లో చేర్పించగా ఆమె ఆదివారం రాత్రి మృతి చెందింది. అలాగే ఓబులేసు (68)ను ఈ నెల 7న జీఈ వార్డులో చేర్పించారు. చికిత్స పొందుతున్న అతను సోమవారం మృతి చెందాడు. మృతుల కుటుంబ సభ్యులు తమను సంప్రదించాలని మార్చురీ ఇన్‌చార్జి వరాలు తెలిపారు.
చికిత్స పొందుతూ ఇద్దరు వృద్ధులు మృతి


