కార్మికులకు, నిరుద్యోగులకు మొండిచేయి
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులను కూటమి ప్రభుత్వం నిలువునా దగా చేసింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో నైనా కార్మికులకు మేలు జరుగుతుందనే ఆశ కొంతైనా ఉండేది. అలాంటిదేమీ లేకుండా కార్మికులకు మొండిచేయి చూపించారు. అలాగే నిరుద్యోగ యువతకు నెలకు 3000 రూపాయలు భృతికి ఈ బడ్జెట్‌లో మంగళం పలికారు. ఎలక్షన్లకు ముందు మాత్రం తీర్చలేని హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక బడ్జెట్ ఖాళీ అయిందని చెప్పడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. ఇలాంటి పాలకులను మరొకసారి అధికారం ఇవ్వకూడదు. – పి వెంకటసుబ్బయ్య,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆప్కాస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్


