కన్నులపండువగా కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కన్నులపండువగా కల్యాణం

Feb 16 2026 7:35 AM | Updated on Feb 16 2026 7:35 AM

కన్ను

కన్నులపండువగా కల్యాణం

కన్నులపండువగా కల్యాణం

పెండ్లిమర్రి : పొలతల క్షేత్రం శివ నామస్మరణతో మార్మోగింది. మహాశివ రాత్రి పర్వదినం సందర్భంగా జిల్లా నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో పొలతల జనసంద్రమైంది. శివరాత్రి రోజున కోనేటిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దీంతో కోనేటిలో భక్తుల సందడి కనిపించింది. ఆలయ ఛైర్మన్‌ రాజారెడ్డి, ఈఓ క్రిష్ణానాయక్‌ సౌకర్యాలను పర్యవేక్షించారు.

అక్కదేవతల ఎదుట..

పొలతల క్షేత్రంలో అక్క దేవతల గుడి చుట్టు అడుగడుగునా భక్తుల సందడి కనిపిచింది. మహిళా భక్తులు కోనేటిలో పుణ్య స్నానాలు ఆచరించి సంతానం కోసం అక్కదేవత గుడి ఎదుట ఒరపడ్డారు.

కన్నుల పండువగా స్వామివారి కల్యాణం

మహాశివ రాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం ఉదయం10.30గంటల నుంచి 12.15 గంటల వరకు శ్రీమల్లేశ్వరస్వామి, పార్వతీదేవి అమ్మవార్ల కల్యాణం వేదపండితుల ఆధ్వర్యంలో కన్నుల పండువగా నిర్వహించారు. కల్యాణానికి ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్యరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.

గట్టి పోలీసు బందోబస్తు

మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ పర్యవేక్షణలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ చల్లని దొర, ఎస్‌ఐ తులసి నాగప్రసాద్‌ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు.

కన్నులపండువగా కల్యాణం1
1/6

కన్నులపండువగా కల్యాణం

కన్నులపండువగా కల్యాణం2
2/6

కన్నులపండువగా కల్యాణం

కన్నులపండువగా కల్యాణం3
3/6

కన్నులపండువగా కల్యాణం

కన్నులపండువగా కల్యాణం4
4/6

కన్నులపండువగా కల్యాణం

కన్నులపండువగా కల్యాణం5
5/6

కన్నులపండువగా కల్యాణం

కన్నులపండువగా కల్యాణం6
6/6

కన్నులపండువగా కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement