బైక్‌ల ఢీ : ఒకరిమృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ల ఢీ : ఒకరిమృతి

Feb 16 2026 7:35 AM | Updated on Feb 16 2026 7:35 AM

బైక్‌

బైక్‌ల ఢీ : ఒకరిమృతి

ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని ఐసీఎల్‌ క్వారీ సమీపంలో రెండు స్కూటర్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హేమంత్‌ కుమార్‌(25) మృతి చెందగా, సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్‌ సీపీ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ డాక్టర్‌ ఎం సుధీర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రున్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మండల పరిధిలోని కదిరివారిపల్లె గ్రామానికి చెందిన పుల్లయ్య కుమారుడు హేమంత్‌ కుమార్‌ సమీపంలో ఓ ట్రాన్స్‌ఫోర్టులో పనిచేస్తున్నాడు. సాయంత్రం పని ముగించుకుని బైక్‌లో ఇంటికి బయలు దేరాడు. అలాగే సీకేదిన్నే మండలం పరిధిలోని ఉటూకురుకు చెందిన సత్యనారాయణ కూడా పని ముగించుకుని ముద్దనూరు వైపు నుంచి స్కూటర్‌లో ఇంటికి బయలుదేరారు. వీరిద్దరు ఐసీఎల్‌ క్వారీ సమీపంలోకి రాగానే రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు రోడ్డుపై కింద పడి పోయారు. హేమంత్‌కుమార్‌కు తల పగిలి రక్తస్రావం జరిగి అక్కడిక్కడే మృతి చెందాడు. సత్యనారాయణ తలకు బలమైన గాయమైంది. కొన ఊపిరితో ఉండటంతో 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సత్యనారాయణ స్కూటర్లో బేల్దారి పనికి సంబంధించిన సామాన్లు ఉండటంతో బేల్దారి అయి ఉంటారని తెలుస్తోంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న స్కూటర్లను తొలిగించి ట్రాఫిక్‌ సమస్య లేకుండా చేశారు.

● కదిరివారిపల్లి గ్రామానికి చెందిన హేమంత్‌కుమార్‌కు పది రోజు కిందట ఆడ బిడ్డ పుట్టిందని, ఇంతలోనే మృతి చెందాడని అతని తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతుడి తండ్రి పుల్లయ్యకు కూడా ఇటీవల కాళ్లు విరిగి ఇబ్బందులు పడ్డారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు హేమంత్‌ కుమార్‌ చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీమున్నిరుగా విలపించారు.

బైక్‌ల ఢీ : ఒకరిమృతి1
1/3

బైక్‌ల ఢీ : ఒకరిమృతి

బైక్‌ల ఢీ : ఒకరిమృతి2
2/3

బైక్‌ల ఢీ : ఒకరిమృతి

బైక్‌ల ఢీ : ఒకరిమృతి3
3/3

బైక్‌ల ఢీ : ఒకరిమృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement