కనుల పండువగా వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం
స్వామి, అమ్మవారి కల్యాణం నిర్వహిస్తున్న వేదపండితులు, కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తజనం
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలో శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో ఈ వేడుక జరిగింది. ఆదివారం ఉదయం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం స్వామి వారు దీక్షాబంధనాలంకారోత్సవంలో దర్శనమిచ్చారు. రాత్రి 9 గంటలకు గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి దంపతుల కల్యాణాన్ని మఠాధిపతి శ్రీ వెంకటాద్రిస్వామి దంపతులు ఘనంగా నిర్వహించారు. తరువాత నరనంది ఉత్సవం ఉత్సాహ భరితంగా జరిగింది. జాగారణ, వివిధ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.
కనుల పండువగా వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం


