ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు
– ఇద్దరికి గాయాలు
పెండ్లిమర్రి : కడప–పులివెందుల ప్రధాన రహదారిలోని పాతసంగటిపల్లె రోడ్డు వద్ద మంగళవారం రాత్రి ఇన్నోవా కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో పాతసంగటిపల్లె హరిజనవాడకు చెందిన మురళి, నాగయ్యలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మురళి, నాగయ్యలు పాతసంగటిపల్లె హరిజనవాడ నుంచి పని నిమిత్తం ద్విచక్ర వాహనంలో వెల్లటూరుకు వస్తుండగా పులివెందుల నుంచి కడపకు వెళుతున్న ఇన్నోవా కారు పాతసంగటిపల్లె రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని అదుపు తప్పి ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనంలో వెళుతున్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కడప అర్బన్ : కడప నగరం జిల్లా కోర్టు సమీపంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజుపాళెం మండలం గోపాయపల్లికి చెందిన బీరం నాగేశ్వర్ రెడ్డి (53) అనే వ్యక్తి దుర్మరణం చెందారు. ఈసంఘటన వివరాలను కడప ట్రాఫిక్ సిఐ సురేష్ రెడ్డి తెలిపారు. మృతుడు తమ స్వగ్రామం నుంచి కడపలో తన మనువడి పుట్టినరోజుకు వచ్చారు. కడప కోటిరెడ్డిసర్కిల్ నుంచి ఆర్టీసి బస్టాండ్ వద్దకు మోటార్‌సైకిల్‌లో వెళుతుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు.
జెఎస్‌డబ్ల్యూ పరిశ్రమ భూముల పరిశీలన
జమ్మలమడుగు : మండల పరిధిలోని కన్యతీర్థం సమీపంలో జిందాల్ పరిశ్రమకు కేటాయించిన భూముల రికార్డులను జాయింట్ కలెక్టర్ నిధిమీనన్ మంగళవారం పరిశీలించారు. సున్నపురాళ్లపల్లె సమీపంలో ఉన్న స్టీల్‌ప్లాంట్ కోసం కేటాయించిన భూములకు సంబంధించిన రికార్డులను ఆర్డీఓ సాయిశ్రీ, తహసీల్దార్ శ్రీనివాసులరెడ్డితో కలసి పరిశీలించారు. ఇంత వరకు కేటాయించిన భూముల్లో ఎటువంటి పనులు జరిగాయని అడిగి తెలుసుకున్నారు. ఏపీ ఇండస్ట్రీయల్ పేరుమీద ఉన్న భూములను జిందాల్‌కు బదాలింపు జరిగిన ప్రాంతాలను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో సర్వేయర్ గురుశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు


