హామీలు నెరవేర్చకపోతే ఆందోళనలు ఉధృతం | - | Sakshi
Sakshi News home page

హామీలు నెరవేర్చకపోతే ఆందోళనలు ఉధృతం

Feb 14 2026 7:55 AM | Updated on Feb 14 2026 7:55 AM

హామీలు నెరవేర్చకపోతే ఆందోళనలు ఉధృతం

హామీలు నెరవేర్చకపోతే ఆందోళనలు ఉధృతం

కడప సెవెన్‌రోడ్స్‌ : ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు ఉల్లంఘించడాన్ని నిరసిస్తూ ఎస్టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కడప కలెక్టరేట్‌ ఎదుట మహా ధర్నా నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్‌. సంగమేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలు తక్షణమే అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి తదితర డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈనెల 25న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు ఇలియాస్‌బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.పాలకొండయ్య, కడప యూనిట్‌కు చెందిన వి.షుగుప్తా యాస్మిన్‌, చప్పిడి సుభాషిణి, రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, దాదాపీర్‌, భాస్కర్‌, సురేష్‌బాబు, జయరామయ్య, సుబ్రమణ్యం, రమణారెడ్డి, చెన్నకేశవరెడ్డి, శివారెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కడపలో ఎస్టీయూ మహా ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement