కడప సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ లో అరుదైన శస్త్ర చికిత్స | - | Sakshi
Sakshi News home page

కడప సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ లో అరుదైన శస్త్ర చికిత్స

Feb 12 2026 7:30 AM | Updated on Feb 12 2026 7:30 AM

కడప సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ లో అరుదైన శస్త్ర చికిత

కడప సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ లో అరుదైన శస్త్ర చికిత

కడప అర్బన్‌ : రిమ్స్‌ ఆవరణలో ఉన్న సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ లో మూత్ర నాళాల సమస్యతో బాధపడుతున్న 9 సంవత్సరాల బాలిక ప్రోక్షిత కు మినిమల్‌ ఇన్వేసివ్‌ విధానంలో పునర్నిర్మాణ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్ర చికిత్సను శ్రీవేసుకో స్కోపిక్‌ బై లేటరల్‌ యురేటరిక్‌ రీ ఇంప్లాంటేషన్ఙ్‌అంటారు. ఈ శస్త్ర చికిత్సను పూర్తి చేయడానికి సుమారు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టింది. ఈ తరహా చికిత్స చాలా అరుదుగా కడప జిల్లాలో తొలిసారిగా నిర్వహించారు. ఈ పేషెంట్‌కు వీయు ఆర్‌ వల్ల కుడివైపు కిడ్నీ పనితీరు తగ్గింది. వీయుఆర్‌ కు శస్త్ర చికిత్స చేయకపోతే రెండు కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుంది. పేషెంట్‌కు కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉండేది. ఈ అడ్వాన్స్‌డ్‌ శస్త్ర చికిత్స వల్ల పేషంట్‌ కోలుకోవడం, నొప్పి లేకపోవడం, త్వరగా హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అవుతారు. ఈ శస్త్ర చికిత్సను డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకం కింద పూర్తిగా ఉచితంగా అందించామని సాధారణంగా ఈ ఆపరేషన్‌కు సుమారు 6 లక్షల రూపాయల వరకు ఖర్చయ్యేదని డాక్టర్లు తెలియజేశారు. ఈ శస్త్ర చికిత్స అనంతరం బాలిక ప్రోక్షిత ఆరోగ్యం మెరుగుపడి, డిశ్చార్జ్‌ సమయంలో సాధారణ స్థితిలో ఉంది. ఈ శస్త్ర చికిత్సను నిర్వహించిన పీడియాట్రిక్‌ సర్జరీ విభాగం ప్రొఫెసర్‌, హెచ్‌ఓడీ డాక్టర్‌ సి. సునీల్‌ కుమార్‌ రెడ్డి, డాక్టర్‌ పి.వి రమణ, డాక్టర్‌ పి. సుకుమార్‌, డాక్టర్‌ ప్రీతి, డాక్టర్‌ సులక్షణతో కూడిన వైద్య బృందం నిర్వహించారు. వైద్య సేవల పట్ల బాలిక తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనస్తీసియా విభాగం, హాస్పిటల్‌ పరిపాలన విభాగం సహకారానికి శస్త్ర చికిత్స బృందం కృతజ్ఞతలు తెలిపింది. ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్లో పురిటి, చిన్నపిల్లలకు అన్ని రకాల సాధారణ, అధునాతనమైన శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నారని, ఈ సౌకర్యాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని డాక్టర్లు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement